కలం, వెబ్ డెస్క్: శీతాకాల అసెంబ్లీ సమావేశాలు (Assembly Winter Session) మొదటి రోజే హాట్‌హాట్‌గా మారిపోయాయి. సంతాప తీర్మానాల అనంతరం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Katipalli Venkataramana Reddy) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొందరు సభ్యులు మాట్లాడుతున్న భాషపై వెంకటరమణారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో సభ్యులు హుందాగా మాట్లాడాలని ఎమ్మెల్యే కాటిపల్లి సూచించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అందరికీ ఆయన చురకలు అంటించారు. బహిరంగసభల్లో, మీడియా సమావేశాల్లోనూ సభ్యులు హుందాగా మాట్లాడాలని కోరారు. ఒకరికొకరు ఏకవచనంతో సంబోంధించుకోవడంతో సభ్యుల గౌరవ మర్యాదలు మంటగలుస్తున్నాయని పేర్కొన్నారు. కాటిపల్లి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తాము హుందాగా, ప్రజాస్వామ్య బద్దంగానే సభను నిర్వహిస్తున్నామని చెప్పుకున్నారు.
Read Also: ఇలా వచ్చి.. అలా వెళ్లిన కేసీఆర్!
Follow Us On: Sharechat


