వరంగల్‌లో హై టెన్షన్.. మాజీ విప్ వినయ్ భాస్కర్ అరెస్ట్..!

కలం, వెబ్ డెస్క్ : కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని అధినాయకత్వం పిలుపునిచ్చిన వేళ సోమవారం వరంగల్ (Warangal ) జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు బీఆర్ఎస్ మహిళలు ర్యాలీగా వచ్చారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

ఈ మేరకు రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు.. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులను ఎగ్గొట్టిందంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో వినయ్ భాస్కర్ ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తీవ్ర ఉద్రిక్తతల నడుమ బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టిన పోలీసులు వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>