పాకిస్థాన్ కొత్త కూటమి.. ట్రంప్ ఏమన్నారంటే!

కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా, తుర్కియే దేశాలతో పాకిస్థాన్ (Pakistan) ఏర్పాటు చేసుకున్న కొత్త కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ‘మూడు దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. మధ్య ఆసియా దేశాలు తమను తాము రక్షించుకునేందుకు పరస్పర సహకారం అందించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ముగ్గురు దేశాధినేతలకు అభినందనలు తెలుపుతున్నా. ఇదొక భారీ, అతి ముఖ్యమైన ఒప్పందం. వావ్!’ అంటూ తన ట్రూత్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు.

ట్రంప్ (Donald Trump) పోస్టుపై పాకిస్థాన్ ప్రధాని స్పందిస్తూ.. తమ దేశాలను రక్షించుకునేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందన్నారు. దక్షిణాసియా దేశాల్లో యుద్ధాలను నివారించి, లక్షల మంది ప్రాణాలను కాపాడిన ట్రంప్ నాయకత్వం పట్ల గర్వంగా ఉందన్నారు.

జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్..

మక్కా రక్షణ ఒప్పందాన్ని భారత్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ మూడు దేశాల్లో సౌదీ అరేబియాతో మాత్రమే భారత్‌కు మంచి సంబంధాలుండగా.. ఆ దేశం కూడా పాకిస్థాన్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఇప్పటికే నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీ ఆందోళనలకు స్పందించిన సౌదీ అరేబియా పాలకులు.. ఇది కేవలం రక్షణ కోసం పాకిస్థాన్‌తో ఏర్పాటు చేసుకున్న కూటమి మాత్రమేనని, భారత్‌కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ అణ్వాయుధాలున్న ఏకైక ముస్లిం దేశం కాగా, తుర్కియే రక్షణ పరంగా బలమైన దేశంగా ఉంది. సౌదీ అరేబియా వద్ద ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవి. ఈ మూడు ఒకదాని ప్రయోజనాల కోసం మరొకటి జత కట్టడంతో భారత్‌కు కొంత ఇబ్బందికర పరిణామంగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read : గాంధీభవన్‌లో సామాజిక వర్గాల రగడ… క్రమ‘శిక్ష’ణలో వివక్ష!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>