జూరాల కాలువకు కోత.. వేధిస్తున్న నిధుల కొరత

కలం, జోగులాంబ గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (Jurala Project)  అధికారుల‌‌ నిర్వహణ లోపం, నిధుల కొరత కారణంగా కుడి,‌ ఎడమ కాలువలు ధ్వంసం అవుతున్నాయి. మరమ్మతులు చేపడుతామని ఏటా నీటి పారుదల శాఖ చెబుతూనే ఉన్నా.. అవన్నీ నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా, ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.

దీనిలో ప్రధానమైన కుడి కాలువకు కొద్దికొద్దిగా కోతకు గురవుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు‌. వెంటనే ప్రాజెక్ట్ అధికారులు స్పందించిన లైనింగ్ పనులు చేయించాలని కోరుతున్నారు. కాలువ గట్లను శాశ్వతంగా బలంగా ఉండేలా చేస్తేనే చివరి ఆయకట్టుకు నీరందుతుందని చెబుతున్నారు. సమస్య మరింత సంక్లిష్టంగా మారకముందే, వెంటనే మరమ్మతులు చేయించాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>