కలం వెబ్ డెస్క్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ(Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆదివారమే ఆయన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు నందినగర్ నివాసానికి బయలుదేరారు. అసెంబ్లీలో పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలు, పాలకవర్గానికి ఇవ్వాల్సిన సమాధానాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు తొలిరోజు సమావేశాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మాణం పెట్టనున్నారు. సంతాప తీర్మానం అనంతరం సభ ముందుకు సాగుతుందా? లేదా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? చిట్‌చాట్‌లో కేటీఆర్
Follow Us On: X(Twitter)


