epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కింద పడ్డ విజయ్.. మళ్లీ శివాజీపై రెచ్చిపోయిన నెటిజన్స్

కలం, వెబ్ డెస్క్: టీవీకే అధినేత, నటుడు విజయ్ దళపతి (Thalapathy Vijay) ఆదివారం చెన్నై విమానాశ్రయంలో తన కారు ఎక్కే ప్రయత్నంలో పడిపోయారు. మలేషియా నుంచి తిరిగివచ్చే సమయంలో ఆయనను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. కొందరు సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నించగా, మరికొందరు విజయ్‌ను తాకాలని ప్రయత్నించారు. అభిమానుల తాకిడి ఎక్కువ పెరగడంతో కారు ఎక్కే క్రమంలో పడిపోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది విజయ్‌ను కారులోకి ఎక్కించారు.

ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఓ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహరంపై నటుడు శివాజీ (Sivaji) హీరోయిన్ల డ్రైస్సింగ్‌పై కామెంట్స్ చేశారు. ఈ ఆయన తీరుపై పలువురు నటీనటులు, నెటిజన్స్ విరుచుకుపడ్డారు.

తాజాగా విజయ్ (Thalapathy Vijay) ఘటన జరగడంతో మరోసారి నెటిజన్స్ శివాజీని టార్గెట్ చేశారు. నిధి అగర్వాల్ ఘటనను గుర్తు చేస్తూ శివాజీని తప్పుపట్టారు. ‘‘అరె విజయ్ చీర కట్టుకొని రావాల్సి ఉంది’’ అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. ‘‘శివాజీ చెప్పినట్టు విజయ్ తన సామాన్లు కవర్ చేసుకోవాల్సి ఉండేది‘‘ అంటూ సెటైర్స్ వేశారు. ‘‘వాళ్లు ఫ్యాన్స్ కాదు.. జాంబీలు’’ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నెటిజన్స్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Read Also: ‘టాక్సిక్’లో ఎలిజిబెత్​ గా హుమా ఖురేషి.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>