దొంగిలించిన చీరే దొంగను పట్టించింది.. చోరీ కేసులో ఊహించని మలుపు!

కలం, వెబ్ డెస్క్​ : మూడేళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసు ఊహించని మలుపుతో బయటపడింది. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ (Bandlaguda Jagir) వినాయక నగర్ నివాసి యాదయ్య 2023 సెప్టెంబర్ 16న కుటుంబంలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి రూ.2,50,000 నగదు, 9 తులాల బంగారం, కొన్ని చీరలు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్‌కు యాదయ్య ఇంటి వెనుక నివాసముండే స్వప్న (29) అనే మహిళ ఒక చీర కట్టుకుని వచ్చింది. ఆ చీరను చూసిన యాదయ్య భార్య అది తమ ఇంట్లో దొంగిలించబడిన చీరేనని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు స్వప్న, ఆమె భర్త రాములు (35)లను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఆ చీర తనదేనని బుకాయించినప్పటికీ, పోలీసుల శైలి విచారణలో యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేశామని దంపతులు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండుకు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>