స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం : శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. శనివారం 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.

ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర సాధన లక్ష్యం కోసం జీవితం మొత్తం త్యాగం చేసారనీ ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో ఇప్పటికి చాలా వర్గాల ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టలేదనీ, వారు అడుగుపెట్టిన రోజునే అన్ని వర్గాలకు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రూపొందుతాయన్నారు.

అంటరాని తనం, మహిళల పట్ల అత్యాచారాలు, కుల విభేదాలు, విద్వేషాలు ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కూకటి వేళ్ళతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, రాజ్యాధికారంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించాలనీ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు ఆంజనేయులు, దేవేందర్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>