‘ఉచిత రేషన్‌పై కాంగ్రెస్ అబద్ధాలు’.. బండి సంజయ్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఉచిత రేషన్ పంపిణీపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం ప్రజలకు ఉచిత రేషన్‌ను అందిస్తుంటే .. తామే అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)  ఫైర్ అయ్యారు.

హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమవేశంలో బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ తెలంగాణలో ప్రవేశపెట్టబోయే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో కాకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఫోటోలు పెడుతున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ తప్పక పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయేదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో సిద్ధ రామయ్య హయాంలో రూ. వందల కోట్లతో తయారుచేసిన స్మార్ట్ కార్డులన్నీ నిరుపయోగమయ్యాయని గుర్తు చేశారు.

22 ఏ పేరుతో భారీ దోపిడీ

తెలంగాణలో నిషేధిత భూముల జాబితా (22 ఏ) ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వ భారీ దోపిడీకి తెరలేపిందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న 2.77 కోట్ల ఎకరాల్లో ఏకంగా 95 లక్షల ఎకరాలను 22 ఏ నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఏనుగులు మింగేటోడు పోయి పీనుగలు మింగేటోడు వచ్చాడని ఫైర్ అయ్యారు. నిషేధిత భూముల జాబితాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : సారీ చెప్పాల్సిందే.. లా విద్యార్థుల అల్టిమేటం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>