epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

2029లోనూ మోదీనే పీఎం.. కేంద్ర మంత్రి అమిత్ షా

కలం, వెబ్​ డెస్క్​: భారతదేశ భవిష్యత్తు, రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో జరగబోయే ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లోని నవ వంజర్ గ్రామంలో లబ్ధిదారులకు భూమి కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. విపక్షాలు ఇప్పుడే ఓటములతో అలసిపోవద్దని, భవిష్యత్తులో వారికి మరిన్ని పరాజయాలు తప్పవని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ విపక్షాలకు ఓటమి ఎదురవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేశ ప్రజలు తమ పార్టీ సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నారని, అందుకే 2029లో కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను విపక్షాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రామమందిర నిర్మాణం, కాశీ క్షేత్ర పునర్నిర్మాణం, పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌర స్మృతి అమలు, బంగ్లాదేశ్ చొరబాటుదారుల బహిష్కరణ వీటన్నింటినీ విపక్షాలు వ్యతిరేకించాయన్నారు. అయినప్పటికీ ప్రజల మద్దతుతో తమ ప్రభుత్వం దేశాభివృద్ధికి కట్టుబడి ఉందని హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అమిత్ షా పేర్కొన్నారు.

Read Also: ది రాజాసాబ్ ట్రైలర్.. ఫ్యాన్స్ కు నిరాశే..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>