కలం, నల్లగొండ బ్యూరో: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు (Paka Hanumanthu) అలియాస్ గణేష్ ఊకే అలియాస్ రాజేశ్ తివారీ(69) భౌతికకాయం ఎట్టకేలకు స్వగ్రామానికి చేరింది. నాలుగు రోజుల క్రితం ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక హనుమంతు చనిపోయిన సంగతి తెలిసిందే. హనుమంతు భౌతికకాయం ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంలకు చేరుకున్నది.
ఆర్ఎస్‌యూ(రాడికల్ స్టూడెంట్ యూనియన్) విద్యార్థి నేతగా అజ్ఞాతంలోకి వెళ్లిన హనుమంతు అనతికాలంలోనే మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. గత బుధవారం రాత్రి ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. డిగ్రీ చదివే సమయంలో ఊరిని విడిచి వెళ్లిన హనుమంతు (Paka Hanumanthu) 42 ఏండ్ల తర్వాత విగతజీవిగా స్వగ్రామానికి వచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఒడిశా వెళ్లి పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
Read Also: మా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది.. అమెరికాకు చైనా వార్నింగ్!
Follow Us On: X(Twitter)


