కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మెడికల్ కాంట్రాక్టు యూనియన్(Medical Contract Workers) నూతన కమిటీని బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై నాయకులు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు నెలకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కాంట్రాక్టు కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి మెరుగైన వేతనాలు, సంక్షేమ సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా కే. శ్రీనివాస చారి, అధ్యక్షుడిగా రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా భూక్య రమేష్, కార్యదర్శిగా వినోద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జీవన్ లక్ష్మి, సత్యవతి, రఘు, సహాయ కార్యదర్శులుగా సాయి కుమార్, సత్యనారాయణ, సునీత, కోశాధికారిగా భాగ్యలక్ష్మి, యన్. లక్ష్మి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా శ్యాంసన్, బందన్న, లావణ్య, సంగీత, డి. రాజమణి ఎన్నికైనట్లు నాయకులు తెలిపారు.

