కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి (Jakkidi Prabhakar Reddy) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను కులం పేరుతో జక్కిడి ప్రభాకర్ రెడ్డి దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాధితుడు బుడ్డ సత్యనారాయణ వెంటనే ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్బీనగర్ పోలీసులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

