కలం,వెబ్ డెస్క్ : విజయవాడలోని పెజ్జోనిపేటకు చెందిన ఓ వృద్ధుడు సైబర్ కేటుగాళ్ల బారినపడి తన జీవితకాల కష్టార్జితాన్ని పోగొట్టుకున్నాడు (Vijayawada Cyber Fraud). ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న దాదాపు రూ.24 లక్షల మొత్తాన్ని నేరగాళ్లు అతడి ఖాతా నుంచి కొల్లగొట్టారు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న నగదుతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా మాయం చేశారు.
బాధితుడి అకౌంట్ నుంచి అక్టోబర్ 20 నుంచే అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే నవంబర్ 4న బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ అలర్ట్ ఈ-మెయిల్స్ రావడంతో బాధితుడు ఈ విషయాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

