కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ ఎయిర్ పోర్ట్ (Warangal Airport) పునరుద్దరణకు మరో అడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరించిన భూములను కలెక్టర్‌కు అప్పగించారు. శనివారం జిల్లా కలెక్టర్‌తో ఏఏఐ(AAI) హైదరాబాద్ మేనేజర్ బీవీ రావు బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా భూములను రెవెన్యూ అధికారులు అప్పగించారు.
అన్ని విధాలా క్లియరెన్స్ ఉన్న 200 ఎకరాల భూమిని అప్పగించారు. మరో మూడు వారాల్లో మిగిలిన 53 ఎకరాలు కూడా ఎయిర్‌పోర్ట్ వర్గాలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎయిర్ పోర్ట్ (Warangal Airport) ఏర్పాటుకు మొత్తం 950 ఎకరాల భూమి అవసరం ఉండగా ఏఏఐ వద్ద 696 ఎకరాల భూమి ఉంది. మిగిలిన భూమి కోసం 254 ఎకరాల్లో 30 ఎకరాల ప్రభుత్వ భూమి మినహా అవసరమైన మామూనూర్ చుట్టు పక్కల గల నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల నుంచి సేకరించారు.
ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అధికార వర్గాలకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తి కావస్తున్న దృష్ట్యా మరి కొద్దీ రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మంచి రోజు చూసుకుని ప్రధాని నరేంద్ర మోడీ తో నిర్మాణ పునరుద్దరణ పనులు ప్రారంభించేందుకు ఏఏఐ వర్గాలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2027 నాటికి వరంగల్‌లో ఎయిర్ పోర్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేపట్టింది.
Read Also: కవిత డ్యామేజ్.. కేటీఆర్ కవరప్
Follow Us On: X(Twitter)


