కలం, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మొదటిసారిగా ఎర్రకోటపై వందేమాతరం (Vande Mataram) గీతం ఆలపించబోతున్నారు. ప్రధాని మోదీతో సహా అక్కడికి హాజరైనవారంతా ఈ గీతాన్ని పాడబోతున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేశ్ సింగ్ తెలిపారు. ఈ ఏడాదితో వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సాధారణంగా జనగణమన గీతంతో వేడుకలు ప్రారంభమై, ముగుస్తుంటాయి. ఈసారి వందేమాతరం కూడా జతకానుంది.
యువ శక్తికి అధిక ప్రాధాన్యత..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో యువ శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఈసారి ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో యువత భాగస్వామ్యం అధికంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఢిల్లీ నగరానికి చెందిన 500 మంది విద్యార్థులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ వేడుకకు పిలుస్తున్నామని సెక్రటరీ రాజేశ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎర్రకోట వద్ద భారీ స్థాయిలో బందోబస్త్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్‌జీ కమెండోలు రంగంలోకి దిగి.. కోట పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Also Read : పార్లమెంట్‌కు రావాలంటేనే వారికి భయం: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

