వర్షాల కోసం వ‌రుణ‌దేవుడి వాహ‌నానికి పూజ‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఒక‌వైపు వ‌ర్షాలు కుర‌వాల‌ని ప్ర‌భుత్వం వ‌రుణ యాగం చేస్తోంది.. మ‌రోవైపు గ్రామాల్లో పూజ‌లు, క‌ప్ప త‌ల్లి ఆట‌లు ఆడుతున్నారు. కానీ, ఎక్క‌డా లేని విధంగా వ‌ర్షాలు కుర‌వాల‌ని ఓ చోట మొస‌లి (Crocodile)కి పూజ‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఇది చూసిన వారంతా షాక‌వుతున్నారు. ఈ ఘ‌ట‌న గ‌ద్వాల (Gadwal) జిల్లాలో జ‌రిగింది. జిల్లాలోని బీచుపల్లిలో ఓ మొస‌లి కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

ఆ మొసలిని జాలర్లు తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. గ్రామంలోని ఆల‌య అర్చ‌కుడు అనిల్ శ‌ర్మ మొస‌లి వ‌రుణ‌దేవుడి వాహ‌నం అని, మొస‌లికి పూజ‌లు చేస్తే వ‌ర్షాలు బాగా కురుస్తాయ‌ని భావించి పూజ‌లు చేశారు. అనంతరం అధికారులు మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు. ఈ పూజ‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>