కలం, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్‌తోనే కాదు.. తన ప్రొఫెషనలిజంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా మాజీ బ్యాటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్.. కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని అత్యుత్తమ ప్రొఫెషనల్‌గా లక్ష్మణ్ అభివర్ణించాడు. కెరీర్లో తనకంటూ కొన్ని ప్రమాణాలను ఏర్పాటు చేసుకున్న కోహ్లీ.. ప్రతి మ్యాచ్‌లో వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తాడని చెప్పాడు.
అదే వైఖరి కోహ్లీని గొప్ప ఆటగాడిగా మాత్రమే కాకుండా.. యువ క్రికెటర్లకు రోల్ మోడల్‌గా నిలిపిందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. చాలా మంది యువ ఆటగాళ్లు కోహ్లీని అనుసరించాలని కోరుకుంటున్నారని తెలిపాడు. కోహ్లీ సుదీర్ఘ కెరీర్లో సాధించిన గణాంకాలు కూడా అతడి స్థాయిని చూపిస్తున్నాయి. ఇప్పటివరకు 562 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 28,359 పరుగులు చేశాడు. ఇందులో 85 సెంచరీలు, 148 అర్ధసెంచరీలు ఉన్నాయి.
అతడి అత్యధిక స్కోర్ 254 నాటౌట్. టెస్టుల్లో కోహ్లీ 123 మ్యాచ్‌ల్లో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు 46.85గా ఉంది. వన్డేల్లో కోహ్లీ రికార్డు మరింత ప్రత్యేకం. 314 మ్యాచ్‌ల్లో 14,941 పరుగులు చేశాడు. 54 సెంచరీలు, 75 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ సగటు 58.59గా ఉంది. టీ20ల్లోనూ కోహ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 125 టీ20ల్లో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. అతడి సగటు 48.69గా ఉంది.
ఇక బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. లక్ష్మణ్‌ను కలిశారు. ఆటగాళ్ల రిహాబిలిటేషన్, గాయాల నిర్వహణ కార్యక్రమంపై ఈ సమావేశంలో సమీక్ష జరిగింది. ఆటగాళ్ల గాయాల విషయంలో నిరంతరం పరిశీలన, సమాచార మార్పిడి ముఖ్యమని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఆటగాడికి ఎదురైన సమస్యకు ఎవరినీ తప్పుపట్టడం కంటే.. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం, సరైన సమాచారాన్ని పంచుకోవడమే ప్రక్రియలో కీలకమని స్పష్టం చేశాడు.

