బిచ్చమేసినట్లు నిధులు కేటాయిస్తారా..? ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్ : బోనాల పండుగకు నిధులు కేటాయింపుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బోనాల పండుగ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు.

అలాగే, బోనాల పండగకు ప్రభుత్వం మొక్కుబడిగా డబ్బులు ఇచ్చిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బోనాల పండుగుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. 80 శాతం ఉన్న హిందువులకు రూ.20 కోట్లు ఇస్తారా.? అదే, 20 శాతం ఉన్న ముస్లిం పండుగలకు రూ.30 కోట్లు ఎలా ఇస్తారు..? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

తమ పండుగలకు డబ్బులు ఇవ్వకుంటే అడగొద్దా అని అన్నారు. ట్యాక్సులు ఎక్కువగా కట్టేది హిందువులు అయితే, ముస్లింల పండుగులకు అధికంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్‌ను గెలిపించేందుకే మన గుడికి డబ్బులు ఇవ్వడం లేదని బండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>