కరీంనగర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్‌ఎం‌డి కాలనీలోని ప్రజాభవన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కవ్వంపల్లి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, తిమ్మాపూర్, మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారు రమేష్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్, పార్టీ నాయకులు పులి కృష్ణ, శ్రీగిరి రంగారావు, కుంట రాజేందర్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, బుదారపు శ్రీనివాస్, కొత్త తిరుపతి రెడ్డి, రాముల యాదవ్, ఎలక రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>