epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఐపీఎల్‌లో వెంకటేష్ అయ్యర్‌కు ఛాన్స్ తక్కువే: కుంబ్లే

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తరపున ఆడే అవకాశం వెంకటేష్ అయ్యర్‌కు లేదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే (Anil Kumble) జోస్యం చెప్పారు. అతడిని రూ.7 కోట్లు పెట్టి కొన్నా.. అతడికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశం పెద్దగా లేదని చెప్పాడు. ఆర్‌సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న నేపథ్యంలో తమ కాంబినేషన్‌లో తక్షణ మార్పులు చేసే అవకాశం తక్కువగా ఉన్నయని కుంబ్లే అన్నారు.. గెలిచిన జట్టు రిథమ్ మరియు సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు కొత్తగా చేరిన ఆటగాళ్లను వెంటనే జట్టులోకి తీసుకోకపోవడం సహజమని Anil Kumble పేర్కొన్నారు.

ప్రధాన ఆటగాళ్లకు సరైన ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో జట్టులోకి హజెల్‌వుడ్‌కు బ్యాకప్‌గా జాకబ్ డఫీ, ఫిల్ సాల్ట్‌కు జోర్డాన్, యష్ దయాల్‌కు మంగేష్ యాదవ్‌లను ఎంపిక చేయడం మంచి వ్యూహమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఇప్పటికే జట్టులో రాణిస్తున్న సుయాష్ శర్మపై ఒత్తిడి రాకుండా రవి బిష్ణోయ్ వంటి సీనియర్ స్పిన్నర్ల కోసం ముందుకు వెళ్లలేదని కూడా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>