కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్ డ్రగ్స్ కేసు(Hyderabad Drugs Case)లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్(Aman Preet Singh)పై పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. అమన్ ప్రీత్ సింగ్ కోసం ఢిల్లీ(Delhi)లో గాలింపు చర్యలు చేపట్టారు. అమన్ నగరంలో ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు శనివారం గుర్తించారు. అనంతరం అమన్ నగరం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో అమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమన్‌పై గతంలో సైతం డ్రగ్స్ కేసు నమోదైంది. తాజాగా రెండోసారి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.


