కలం, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు (Longest Hair) కలిగి ఉన్న వ్యక్తి భారత్‌కు చెందిన రేణు ధారియాల్ (Renu Dhariyal) రికార్డు సృష్టించారు. ఆమె జుట్టు ఏకంగా 271.50 సెం.మీ పొడవు ఉంది. ఇది అడుగుల్లో చూస్తే 8 అడుగుల 10 అంగుళాల వరకు ఉంటుంది. గతంలో ఈ వరల్డ్ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నస్య్రోవా అనే మహిళ పేరున ఉండేది. తాజాగా ఆమెను దాటుకొని రేణు ఈ రికార్డు సృష్టించారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు 2015 నుంచి జుట్టు కత్తిరించుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. జుట్టుకు ఎలాంటి రసాయనాలు వాడకుండా, కేవలం సహజసిద్ధంగా తయారైన షాంపులు, నూనెలు వాడింది. అందుకే గత పదేళ్ల నుంచి తను జుట్టు రాలడం, డాండ్రఫ్ వంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపింది. తాను ఎంతో జాగ్రత్తగా పాడుకుంటూ పెంచుకున్న జుట్టుకు గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని రేణూ చెప్పింది. ఇక రేణూ జుట్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు పలు రకాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

