కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ది రాజాసాబ్. జనవరి 9న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్ (Prabhas) మాట్లాడుతూ.. ఈ సినిమాకు అసలైన హీరో నిర్మాత టీజీ విశ్వ ప్రసాదే అన్నారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిందని తెలిపాడు ప్రభాస్. ‘బాలీవుడ్ నటుడు సంజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే నాకు మెంటలొచ్చేసింది. ఆయన సీన్లు చూసి నా సీన్లు మర్చిపోయాను. అంత బాగా నటించారు. హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి అద్భుతంగా నటించారు. నిధి అగర్వాల్ సెట్ లో అందరికీ ఫేవరెట్. చాలా హంబుల్ పర్సన్. ఆమె వల్ల చాలా ఎంటర్ టైన్ మెంట్ అయ్యేది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి చాలా నేర్చుకున్నానని.. అతని బీజీఎం, పాటలు మంచి ఊపు తెచ్చాయన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ‘తమన్ ను చూస్తే నాకు కూడా అలా ధైర్యంగా ఉండాలి అనిపించేది. అతని మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ధైర్యం చూస్తే నాకే షాక్ అనిపించింది. ఎందుకంటే మేం ముందు అనుకున్న బడ్జెట్ వేరు. కానీ షూటింగ్ అవుతున్నా కొద్దీ కథను బట్టి బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అది చూసి మేమంతా భయపడ్డాం. కానీ నిర్మాత మాత్రం భయపడలేదు. నిజంగా ఆయనే ఈ సినిమాకు రియల్ హీరో. ఆయన వల్లే ఈ మూవీ నిలబడింది. మారుతి మూడేళ్ల పాటు ఈ మూవీ స్ట్రెస్ అంతా భరించాడు. చాలా ఏళ్ల తర్వాత నాకు ఓ మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతున్నాడు. సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నీ హిట్ కావాలి. నేను ఎంత పెద్ద స్టార్ అయినా.. సీనియర్ హీరోల తర్వాతనే. వారి నుంచే చాలా నేర్చుకున్నాను. నా సినిమాను కూడా ఆదరించండి’ అంటూ కోరాడు ప్రభాస్.


