కలం, వెబ్ డెస్క్: మంత్రి సీతక్క (Seethakka) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మంగపేట మండలం కొత్తమల్లూరు గ్రామంలో రహదారి దుస్థితిపై గ్రామస్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై వరి నాట్లు నాటి తమ నిరసనను తెలియజేశారు. వర్షాల కారణంగా రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, బురదతో నిండిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Also Read : తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తికి డ్యూటీ .. డాక్టర్ సస్పెండ్!
Follow Us On : WhatsApp

