కలం, వెబ్ డెస్క్ : జగన్ ఫ్లెక్సీ (Jagan Flexi)కి మేకపోతును బలిచ్చి రక్తాభిషేకం చేయడం సంచలనంగా మారింది. పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో కొందరు జగన్ అభిమానులు రెచ్చిపోయారు. జగన్ బర్త్ డే ఫ్లెక్సీలో 2029లో గంగమ్మ జాతరే అని.. రప్పా రప్పా అంటూ రాశారు. ఈ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలిచ్చారు. ఆ తర్వాత మేకపోతు రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేసి వీడియో చేశారు. ఇందులో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. రాక్షస జాతికి చెందిన వారే ఇలా చేస్తారని.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు వెంకటరాజు. ఈ ఘటనపై పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. రక్తాభిషేకం చేసిన ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసి స్ట్రాంగ్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. వారందరినీ నల్లజర్ల కూడలి దాకా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
Read Also: తిరగబడుతున్న టీడీపీ కార్యకర్తలు.. తప్పు చేశామంటూ ఆవేదన
Follow Us On: X(Twitter)


