కలం, కరీంనగర్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మన కళాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం చేనేత అని అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ రంగాన్ని నిలబెడుతున్న ప్రతి చేనేత కార్మికుడి కృషి అభినందనీయమని కొనియాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత, ఆదాయ వృద్ధి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం అన్ని వేళలా చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. చేనేత రంగం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి చేనేత కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి పొన్నం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

