epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. అరవింద్, దిల్ రాజు వైపే అందరి చూపు..?

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు అన్నట్టు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు సపోర్ట్ చేస్తున్నారు. మన ప్యానెల్ ను సి.కళ్యాణ్‌, ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాల నుంచి వాదనలు బలంగానే వస్తున్నాయి. పెద్ద నిర్మాతలపై చిన్న నిర్మాతలు బాగానే ఫైర్ అవుతున్నారు. తమ సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదని, టికెట్ రేట్లు పెంచట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద నిర్మాతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.

ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేది తామే అంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా అందరి చూపు మాత్రం దిల్ రాజు, అల్లు అరవింద్ (Allu Aravind) మీదనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో వీరిదే అప్పర్ హ్యాండ్. వీరు ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలుస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అందరి చూపు వీరిద్దరూ ఏం చేస్తారా అనే దాని గురించే ఉంది. ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) లో ఉన్న చాలా మంది నిర్మాతలతో వీరిద్దరూ మాట్లాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. తాము మద్దతిస్తున్న ప్యానెల్ నే గెలిపించుకోవాలని చూస్తున్నారంట. ఇప్పటి వరకు తాము ఇండస్ట్రీకి చేసిన పనులతో పాటు.. ఇతర నిర్మాతలతో తమకున్న పరిచయాలను కూడా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఎవరు గెలుస్తారో రేపు తేలిపోనుంది.

Read Also: పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. ఏ 11 అల్లు అర్జున్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>