epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నకిలీ మద్యానికి చెక్ పెట్టడానికి స్పెషల్ యాప్: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యానికి కళ్లెం వేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందుకోసమే ప్రత్యేక యాప్(AP Excise Suraksha) తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ‘‘కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం కూడా ఒకటన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసేసిందని విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో గంజాయి పంటను వాణిజ్య పంటగా భావించి పండించి, సరఫరా చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థల ప్రక్షాళన షురూ చేశామని వివరించారు.

‘‘గత పాలకులు డిస్లటరీలు హ్యండోవర్ చేసుకున్నారు. ఓ నేర సామ్రాజ్యాన్ని స్థాపించారు. గత ప్రభుత్వం జరిగిన మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మద్యం విషయంలో కొందరు కుట్రలు చేస్తున్నారు. నేరాలు చేసి వాటిని ఎదుటివారిపై తోసేస్తున్నారు. ఈ నకిలీ మద్యాన్ని నియంత్రించడం కోసం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్(AP Excise Suraksha) తీసుకొచ్చాం’’ అని తెలిపారు చంద్రబాబు.

‘‘నకిలీ మద్యం తయారు చేయడం ఆఫ్రికాలో నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకుని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీని వెనక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటాం. రాజీపడే ప్రసక్తే లేదు. మా పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా.. సస్పెండ్‌ చేశాం’’ అని సీఎం చంద్రబాబు(Chandrababu) వెల్లడించారు.

Read Also: పవన్‌తో ప్రయాణంపై నాదెండ్ల ట్వీట్.. పవన్ రెస్పాన్స్ ఇదే..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>