కలం, వెబ్ డెస్క్: యూపీఐ చెల్లింపులపై (UPI Payments) ఛార్జీలు విధించే పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్-2007′ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ఆమోదించడం గమనార్హం. అనంతరం బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం తెలిపితే.. రాష్ట్రపతి సంతకం తరువాత చట్టంగా రూపుదాల్చనుంది. వినియోగదారుల చెల్లింపుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
భవిష్యత్తులోనే ఛార్జీల విధింపు..
ప్రస్తుతం యూపీఐ చెల్లింపులపై (UPI Payments) జీరో ఎండీఆర్ విధానం అమల్లో ఉంది. అంటే లావాదేవీల సందర్భంగా ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. కొత్త చట్టం ద్వారా ఎంపిక చేసిన వాటిపై భవిష్యత్తులో ఎండీఆర్ విధించుకునే అధికారాన్ని బ్యాంకులకు ఇవ్వబోతున్నారు. అయితే ఆర్బీఐ, బ్యాంకుల మధ్య చర్చలు జరిగిన తరువాతనే అని బిల్లులో పేర్కొన్నారు. ఎంత ఛార్జీలు, ఎవరికి విధించాలి, ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారనేది మాత్రం ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. సాధారణ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!
Follow Us On : WhatsApp

