కలం, వెబ్ డెస్క్: రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చే ప్రతి కస్టమర్‌కు ఉచితంగా తాగునీరు (Drinking Water) అందించడం ఇకపై తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం కొత్త నిబంధనలను అమలోకి తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి రెస్టారెంట్‌లోనూ ‘ఉచిత తాగునీరు అందుబాటులో ఉంది’ అనే బోర్డులను కచ్చితంగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని హోటళ్లలో నీటిని (Drinking Water) ఇవ్వకుండా, కేవలం ఖరీదైన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించే రెస్టారెంట్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే..!
Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Follow Us On : WhatsApp

