రంగారెడ్డి(Rangareddy) జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. కుమార్(35) అనే వ్యక్తిని భార్య అతి దారుణంగా హతమార్చింది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడన్న కారణంగా కొడుకు చూస్తుండగానే భర్తను హత్య చేసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుమార్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతుండే వారు. అదే విధంగా శనివారం రాత్రి కూడా భార్యభర్తల మధ్య భారీ గొడవ జరిగింది. దాంతో సహనం కోల్పోయిన భార్య మాధవి.. కుమార్ నిద్రపోతున్న సమయంలో కుమారుడు చూస్తుండగానే సిమెంట్ ఇటుకతో భర్తను తలపై కొట్టి హతమార్చింది.
Rangareddy | ఆ తర్వాత మృతదేహాన్ని దగ్గర్లో కొత్తగా నిర్మిస్తున్న సంపులో పడేసి ఇంటికి వచ్చేసింది. కుమార్ సోదరుడు ఈ విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు మాధవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అన్న కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

