కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు (Mynampally) కూడా కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని దష్ప్రచారం చేస్తే సహించబోమని.. టీ న్యూస్ ఛానెల్ ను నేల మట్టం చేస్తామని మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్లు పదుల సంఖ్యలో ఓ న్యూస్ ఛానల్ మీద దాడిచేశారని.. కానీ, తాము మాత్రం లక్షల మందితో కలిసివచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని మైనంపల్లి హెచ్చరించారు. ఏదిపడితే అది ఇష్టారాజ్యంగా రాస్తూ మీడియా పరువు తీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం భాషను భ్రష్టు పట్టించిందని ఆయన విమర్శించారు. తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ పదవులు దక్కించుకున్నాడని.. కానీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యారని తెలిపారు. షార్ట్ కట్ లో గద్దెనెక్కిన కేటీఆర్ కు ఏం తెలుసు అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా.. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బ తగిలిన కేటీఆర్ కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో సొంత ఫ్లైట్ లు కొనుక్కున్నారని, లక్షల కోట్లు సంపాదించారని మైనంపల్లి ఆరోపించారు. ఈ అవినీతి సొమ్ముపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా కట్టిన ఇండ్లను హైడ్రా ద్వారా కూలగొట్టించాలని మైనంపల్లి (Mynampally) విజ్ఞప్తి చేశారు.
Read Also: నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు : ప్రకాష్ రాజ్
Follow Us On: Instagram


