కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court)లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ బిల్లు – 2026కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు తీసుకొచ్చిన ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది. తాజాగా రాజ్యసభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న 8 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఆ తర్వాత న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెండింగ్ కేసులో భారంతో సతమతమవుతున్న సుప్రీంకోర్టుకు తాజా నిర్ణయం ద్వారా ఊరట లభించనుంది. ఈ తాజా సవరణ వల్ల రాజ్యాంగ ధర్మాసనలు మరింత క్రమబద్ధంగా ఏర్పాటు కావడమే కాకుండా, పెండింగ్ కేసుల పరిష్కార వేగవంతం చేసే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

