డిప్యూటీ స్పీకర్‌గా బాలూ నాయక్ !

కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ (Balu Naik) పేరు దాదాపుగా ఖరారైంది. గతంలోనే ఆయనను ఈ పోస్టులో నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించినా వాయిదా పడింది. మంత్రి పదవిని ఆశిస్తున్నారని అప్పట్లో వార్తలు రావడంతో డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్‌ పేరు ఫైనల్ అయింది. ప్రకటన సైతం వెలువడింది. కానీ, ఆయన ఇప్పటికీ బాధ్యతలు తీసుకోలేదు. రానున్న కాలంలో ప్రభుత్వం తీసుకోనున్న కొన్ని కీలక విధాన నిర్ణయాలు, దానికి తగిన బిల్లులపై చర్చ, ప్రతిపక్షాలు తరచూ సమావేశాలకు భంగం కలిగిస్తున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తుండడంతో సభను సజావుగా నడిపేందుకు సీనియర్ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని సీఎం భావించారు.

కానీ, ఇప్పటికే రామచంద్రు నాయక్ పేరును ఖరారు చేసినందున డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టడానికి బాలూ నాయక్ సిద్ధంగా లేరు. ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం.. రెండు రోజుల క్రితం బాలూ నాయక్‌తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలను పిల్చుకుని కన్విన్స్ చేసినట్లు తెలిసింది. ఈ నెల 17న లేదా 18న ఒక రోజు అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో అదే రోజున డిప్యూటీ స్పీకర్‌గా బాలూ నాయక్ ఎన్నికలను ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>