ఇద్దరు విద్యార్థులు మృతి.. జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లాలో ఇద్దరు విద్యార్థుల మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జగిత్యాల రూరల్ మండలం టీ ఆర్ నగర్‌కు చెందిన సుశాంత్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన విష్ణు మల్యాల ఒడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు సోమవారం మరణించారు. కుటుంబ సభ్యులు వచ్చేలోపే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం చేసేందుకు తీసుకురావడంతో భగ్గుమన్నారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పోస్ట్ మార్టం చేస్తారంటూ ఆందోళనకు దిగారు.

పోలీస్ అధికారుల హామీతో..

మృతదేహాలను తీసుకోవడానికి నిరాకరించడం, కుటుంబ సభ్యుల ఆందోళనతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి (Jagtial Hospital) ఏరియా కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. రాత్రి సమయంలో మృతదేహాలను ఎలా ఆసుపత్రికి తరలిస్తారని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు తమను పోలీసులు కొట్టారని ఆరోపణలు చేశారు. అనంతరం, పోలీస్ అధికారులు వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : రైతన్న ఫామ్‌ పాండ్ నిర్మించుకో.. జలసిరిని ఒడిసిపట్టుకో!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>