కలం, వెబ్‌డెస్క్: చెన్నైలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్, త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధిపై తంజావూరులో కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఉదయనిధిని స్టేషన్‌కు తరలించారు.
ఉదయనిధి అరెస్ట్‌తో ప్రభుత్వంపై డీఎంకే శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. బుధవారం తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ పై ప్రశ్నిస్తారన్న భయంతోనే ముందస్తుగా అరెస్ట్ చేశారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉదయనిధిని అరెస్ట్ చేయొద్దంటూ డీఎంకే మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ నేడు మధ్యాహ్నం విచారణకు రానుంది.
ఉదయనిధి అరెస్ట్ అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ ను న్యాయపరంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడాన్ని జోక్ గా తీసుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు.

