తిట్టడం గొప్ప కాదు.. యువతకు మను బాకర్ హితవు!

కలం, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన పిస్టల్ షూటర్ మను బాకర్ (Manu Bhaker) యువతకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. బూతులు మాట్లాడటం ఎంతమాత్రం గొప్ప విషయం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఈ రోజుల్లో రోజువారీ సంభాషణల్లో తిట్ల వాడకం బాగా అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన మను బాకర్ (Manu Bhaker) భాషా విధానంపై మాట్లాడారు. మనం మాట్లాడే భాషే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని చెప్పారు. మనం చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలే కాలక్రమేణా మన క్యారెక్టర్‌గా మారతాయని అన్నారు. అందుకే మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని సూచించారు. బూతులు మాట్లాడటం వల్ల ఎవరూ గొప్పవారు అయిపోరని తేల్చి చెప్పారు. అసలైన గొప్పతనానికి ఆమె ఒక స్పష్టమైన అర్థం చెప్పారు.

కష్టపడి పనిచేయడం నిజమైన గొప్పతనం అని అన్నారు. ఇతరుల పట్ల దయతో ఉండడం, గౌరవం ఇవ్వడం ముఖ్యమని చెప్పారు. నిజాయితీతో విజయం సాధించి తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావడమే అసలైన విజమని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా సమాజంలో, ముఖ్యంగా యువతలో తిట్లను ఒక సాధారణ విషయంగా భావిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దైనందిన సంభాషణల్లో ఇతరులను కించపరిచేలా మాట్లాడటాన్ని అలవాటు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకే తాను ఈ విషయంపై స్పందించాల్సి వచ్చిందని వివరించారు.

Also Read : ‘నా గెలుపు బీజేపీకి ఒక సందేశం’​.. పీకే కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>