మళ్లీ విధుల్లోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్

కలం, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) రంగనాథ్‌ తిరిగి విధుల్లో చేరారు. వారం రోజుల పాటు వ్యక్తిగత సెలవు మీద కేరళ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం నాడు హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలువురి సమస్యలు విని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రంగనాథ్‌(Ranganath)ను తొలగించి ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించాలని హైకోర్ట్ ఇటీవలే తీర్పు వెలువరించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడ్డాక.. సెలవు మీద వెళ్లిన ఆయన తిరిగి విధుల్లో చేరడం ఆసక్తికరంగా మారింది.

డివిజన్ బెంచ్‌లో అప్పీల్..?

వీలైనంత త్వరగా రంగనాథ్‌(Ranganath)ను తొలగించాలన్న హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆయనకు అండగా నిలవాలని భావిస్తున్న ప్రభుత్వం.. న్యాయ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైడ్రా చర్యలు ఇక మీదట కూడా కొనసాగుతాయని ఇప్పటికే తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి.. కోర్టులను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడిన విషయం తెలిసిందే.

Also Read : తిట్టడం గొప్ప కాదు.. యువతకు మను బాకర్ హితవు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>