కలం, వెబ్ డెస్క్: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సంచలన విజయం సాధించారు. బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 20 వేల ఓట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభిన్ రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. పోటీకి దిగిన ప్రశాంత్ కిషోర్.. తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి బీహార్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. కాషాయానికి కంచు కోట లాంటి స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలుపొందడంతో బీహార్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత అసెంబ్లీ స్థానాన్ని కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

