కలం, వెబ్ డెస్క్: మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా రాబోతున్న ‘వారణాసి’ మూవీ (Varanasi Movie) గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్పెషల్ వీడియోలో చూపించింది చాలా తక్కువేనని, ఎన్నో రహస్యాలను దాచి పెట్టామన్నారు. ట్రైలర్‌లో ఈ కథ గురించి చెప్పడం సాధ్యం కానందునే.. వీడియో విడుదల చేశామన్నారు. 80 శాతం షూటింగ్ పూర్తయిందని, దీనిలోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించామన్నారు. చిన్న చిన్న సీన్లు పెండింగులో ఉన్నాయని.. వాటిని అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.
వారణాసి నుంచి బయల్దేరి..
ఈ మూవీ(Varanasi Movie)లో మహేశ్ ప్రపంచ సాహస యాత్రికుడి పాత్రలో కనిపించబోతున్నారని రాజమౌళి వెల్లడించారు. వారణాసి నుంచే అతడి జర్నీ మొదలవుతుందని.. అంటార్కిటికా, ఆఫ్రికా, పురాతన రోమ్ నగరాల్లో సాహసాలు చేసి, తిరిగి వారణాసికే వస్తారని పేర్కొన్నారు. అందుకే మూవీకి వారణాసి అనే టైటిల్ పెట్టామన్నారు. ఇదొక విభిన్నమైన కథ అని, ఇలాంటి మూవీ చేయడం తనకు కూడా చాలా సర్‌ప్రైజింగ్ అన్నారు. హాలీవుడ్ చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇండియానా జోన్స్ వంటివి ఇప్పటికీ ఫేవరేట్ అని.. వాటిని చూసినప్పుడు పిల్లాడిలా మారిపోతానని వివరించారు.
Also Read : ‘మీ సేవ’లో అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సీఎస్
Follow Us On : WhatsApp

