epaper
Friday, January 16, 2026
spot_img
epaper

132కే ఆస్ట్రేలియా ఆలౌట్.. తప్పు కంగారూలదే..

కలం, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్‌తో ఆడుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) చెత్తగా ఆడింది. 135 పరుగులకే ఆలౌట్ అయింది. 4 పరుగుల ఓవర్‌నౌట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను స్టార్ట్ చేసిన ఆసిస్.. 22 పరుగుల దగ్గర తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు చెప్పుకోదగ్గర స్కోర్ చేయకుండానే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో 132 పరుగులకే ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు ఇంగ్లండ్ 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది. అయితే ఈ మ్చాచ్‌లో 132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ కావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

11వ నెంబర్ ఆటగాడిని ఓపెనర్‌గా దించడమే ఈ విమర్శలకు కారణం. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచామన్న తిక్క తలకెక్కిందా ఆస్ట్రేలియాకి?(Australia) అని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉంటారు. అయితే 11వ ప్లేయర్ బోలాండ్ బ్యాట్ పట్టి మైదానంలోకి వస్తున్నప్పుడు ప్రేక్షకులంతా స్వాగతం పలికారు.. కానీ ఇప్పుడు వాళ్లే విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాది ఓవర్ కాన్ఫిడెన్సా? వ్యూహమా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తప్పులు ముమ్మాటికీ ఆస్ట్రేలియాదేనని విశ్లేషకులు అంటున్నారు. ఎంత సిరీస్ చేతికిచిక్కినా.. 11వ నెంబర్ ప్లేయర్‌ను ఓపెనర్‌గా దించడం అహంకారంగానే ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఇది.. ప్రత్యర్థి జట్టును అవమానించడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>