స్నేహితులను గెలిపించడమే గొప్ప విజయం: అల్లు అర్జున్

కలం, వెబ్ డెస్క్: సినిమాలు, ఫ్యామిలీకి మాత్రమే కాదు.. స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చే నటుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ముందుంటారు. తాను ఎదుగుతూ, స్నేహితులు కూడా ఎదగాలని ఈ ఐకాన్ స్టార్ భావిస్తుంటారు. నిర్మాత బన్నీవాసు అల్లు అర్జున్‌కు మంచి స్నేహితుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పలు సినిమాలకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రెండ్‌షిప్‌ డేను పురస్కరించుకొని అల్లు అర్జున్ అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ప్రపంచంలో విజయం అంటే ఒంటరిగా శిఖరాన్ని చేరుకోవడం మాత్రమే కాదని, ఆ ప్రయాణంలో మనతోపాటు నడిచిన స్నేహితులను కూడా అదే శిఖరంపై నిలబెట్టడమే నిజమైన విజయమన్నారు.

స్నేహం అనేది కష్టసుఖాల్లో తోడుగా నిలవడం, కలిసి ఎదగడం, ఒకరి విజయాన్ని మరొకరు పంచుకోవడంలోనే గొప్పతనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్నేహితులను మరచిపోకుండా వారిని కూడా విజయపథంలో ముందుకు తీసుకెళ్లడం నిజమైన స్నేహామన్నారు.

Also Read : నీటిలోనూ ప‌ని చేసే రోబో.. చైనా స‌రికొత్త సృష్టి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>