ఓవైసీతో కేసీర్‌, రేవంత్ ఫ్రెండ్షిప్ డే.. వీడియో వైర‌ల్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: నేడు స్నేహితుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో వైర‌ల్‌గా మారింది. సీఎం రేవంత్​ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ కలిసి బైక్​పై తిరుగుతున్నట్లు, కారెక్కి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లు ఇందులో ఏఐలో వీడియో క్రియేట్​ చేశారు.

ఈ పోస్టుకు బీజేపీ ఆసక్తికర క్యాప్షన్​ను జోడించింది. హైడ్రా ఓవైసీకి చెందిన ఫాతీమా కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​ రెడ్డి పక్షపాత ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడింది, బీఆర్ఎస్ కూడా దీన్ని ప్రశ్నించదని బీజేపీ చెప్తోంది. మూసీ ముంపులో ఉన్న ఫాతీమా కాలేజీకి సీఎం రేవంత్​ రెడ్డి పహారా కాస్తున్నాడని, అక్రమ పునాదులపై వీరిద్దరి బంధం బలపడిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియోలో సైతం ఫాతీమా కాలేజీ వద్ద ముంపులో రేవంత్​ రెడ్డి, అసదుద్దీన్​ సరదాగా మాట్లాడుకుంటున్నట్లు చూపించారు.

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రేవంతుద్దీన్ – ఓవైసీ మిత్ర ద్వయానికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో పోస్టులో కలకాలం కలిసి కుట్రలు చేసే విడదీయలేని మైత్రి బంధానికి స్నేహితుల దినోత్సవం అంటూ కేటీఆర్​, కేసీఆర్​ రేవంత్​ రెడ్డి, ఓవైసీల ఏఐ వీడియో పోస్ట్ చేశారు. మరోవైపు నెటిజన్లు దీనికి పలు రకాలుగా స్పందిస్తున్నారు. బీజేపీ (Telangana BJP) నేతలు ఎంఐఎం, కాంగ్రెస్​ పార్టీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను కామెంట్లలో పెడుతూ విమర్శిస్తున్నారు.

Also Read : కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>