epaper
Tuesday, November 18, 2025
epaper

గుంటూరులో పరువు హత్య.. కూల్ డ్రింక్‌లో విషం..

Guntur | మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ హత్య ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. యువతికి పరువు హత్యే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు ఇష్టం లేకుండా ప్రియుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధం కావడంతోనే యువతిని హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుగ్గిరాల మండలం చిలమూరులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువతిని వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించినట్లు సమాచారం. ఆ యువకుడికి ఇచ్చి పెళ్ళిచేయడానికి ఇంట్లోని వారు నిరాకరించారు. అంతేకాకుండా యువతికి ఇష్టం లేకుండా వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు. దీంతో ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని యువతి భావించింది. అందుకు అంతా సిద్ధం చేసుకుంది. ఈ విషయం తెలిసిన కుటుంబీకులు యువతిని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు.

Guntur | కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి కుటుంబీకులే హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. అనంతరం యువతి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగినట్లు సమాచారం. యువతిని తొలుత తెనాలి, ఆ తర్వాత గుంటూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని తెనాలి వైద్యులు చెప్పడంతో వెంటనే గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి తుదిశ్వాస విడిచింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: విశాఖ.. హైదరాబాద్‌ కన్నా వేగంగా అభివృద్ధి అవుద్ది: నారా లోకేష్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>