కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత(Cold Wave) పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) భారీగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉదయాన్నే బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాతావరణ శాఖ(IMD) పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. ఏపీలోని పాడేరులో చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు దట్టంగగా అలుముకుంది. మినుములూరులో ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. అరకులో 6 డిగ్రీలు, పాడేరులో 7, చింతపల్లిలో 8.2 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. రాత్రి వేళ మరో 3 డిగ్రీలు తగ్గనున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


