అభివృద్ధి విషయంలో విశాఖతో హైదరాబాద్ పోటీ పడలేదని ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చెప్పాడు. హైదరాబాద్ అభివద్ధి చెందడానికి 30 సంవత్సరాలు పట్టిందని, కానీ విశాఖ కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్‌ను అదిగమిస్తోందన్నారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్(AI Edge Center)తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు లోకేష్. ఈ సందర్భంగానే విశాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విశాఖను నెవ్వర్ బిఫోర్ అనేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. టీసీఎస్‌కు తక్కువ ధరకు భూములు కేటాయించిన తర్వాతనే అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి క్యూ కట్టాయన్నారు.
‘‘డబుల ఇంజిన్ సర్కార్.. బుల్లెట్ ట్రైన్‌లా దూసుకెళ్తోంది. ఏపీ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం పూర్తి సహకారం అందిస్తున్నారు. కేంద్రం చేపట్టే సంస్కరణల్లో ఏపీకి ప్రాముఖ్యత లభిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంటు 80 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. పూర్తి స్థాయి సామర్థ్యంతో పని చేసేలా కృషి చేస్తున్నాం. విశాఖలో పెట్టుబడులపై 3 నెలల్లో మరిన్ని ప్రకటనలు వస్తాయి. రాజకీయ, అధికార పొరపాట్లతో ఏ ఒక్క పెట్టుబడీ ఏపీ చేజారకూడదు. పొరపాట్లతో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు’’ అని Nara Lokesh అన్నారు.
Read Also: రుషికొండ భవనాలను ఎలా వాడదాం.. సూచనలు అడిగిన ప్రభుత్వం

