ధర్మపురిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లా ధర్మపురి (Dharmapuri) మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) శనివారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 10 మంది లబ్ధిదారులకు సుమారు రూ.10 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>