కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా వలిగొండ (Valigonda) పట్టణ కేంద్రంలో శనివారం ఉదయం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందే విద్యార్థులు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ల కొనుగోళ్లు మొదలు పెట్టడంతో దుకాణాలు కిటకిలాడాయి. ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఆదివారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు దినం కావడంతో ముందు రోజైనా శనివారం నాడే తమ స్నేహితులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టాలని విద్యార్థులు హడావుడిగా కొనుగోలు చేశారు.

