కలం, వెబ్ డెస్క్: అన్నమయ్య (Annamayya) జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిన్నమండెం మండలం దేవలంపల్లి చెక్ పోస్ట్ వద్ద అంబులెన్స్, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నుంచి కడపకు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా దేవలంపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న అంబులెన్స్, కారు అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు తీవ్రంగా దెబ్బతింది.
మరణించిన వారిని ప్రవీణా (33), శ్రీకాంత్ (30)గా పోలీసులు గుర్తించారు. వీరు కడపకు చెందిన వారుగా తెలుస్తోంది. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
Read Also: ‘సోషల్ వార్’.. జాన్వీకపూర్ వర్సెస్ ధ్రువ్ రాఠీ
Follow Us On: Instagram


